వేంకటేశ్వరా
శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
శతకం
బొక్కటి వ్రాయ నెంచితిని మీచారిత్ర్యముల్
చాటుచున్
నుతియింతుం
దమ లీల లన్నిటిని నే నోరార రమ్యంబుగా
వెతలం
బెట్టక శక్తి నిచ్చి నను దీవింపంగ రావే నమ
శ్శతముల్
సేసెద భక్తినిం దిరుమలేశా భక్త రక్షాగ్రణీ
|
శ్రీసతి భీకరాగ్రహము శ్రీపతి శాంతము
గాదె మిమ్మిలన్ భాసిత సప్తశైలయుత భారత విశ్రుత పుణ్య
భూమిలో హాస విలాస రేఖల విహార నివాసము సేయ
నిల్పె సం త్రాస జనాళి రక్షణకు రాజనిభానన
వేంకటేశ్వరా! |
1.
|
|
|
|
|
నుదుటను నామ మొప్పెను గనుంగవ కన్పడ కుండు నట్టులన్ సదమల దామ మొప్పెను భుజద్వయ భాసిత
భూషణమ్మనన్ ముదిత లలంకరించి రట ముచ్చట గొల్పుచు
వక్ష మందునే
త దసదృ శాకృతిం గనఁగ ధన్యుల
మైతిమి వేంకటేశ్వరా! |
2.
|
|
|
|
|
శంభుని కంఠ మందును విషమ్మును జంద్రుని యందు మచ్చయున్ గుంభిత తాపమే యినుని క్రూర కరమ్ములఁ దల్లడిల్లఁగన్ గుంభన రీతిఁ జంపె వనిఁ గోఁతిని
రాముఁడు నట్టి దోషముల్ సంభవ మన్న మీ కడ నసత్యపుఁ బల్కులు
వేంకటేశ్వరా! |
3.
|
|
|
|
|
కలువలు పూయ నేర్చునె ప్రకాశిత చారు
శశాంకుఁ గానకే వలవల యేడ్చుఁ బద్మములు పశ్చిమ దిక్కున సూర్యుఁ డున్నచో వెలవెలఁ బోవు గేహములు పేరిమిఁ బూజలు సల్పకున్నచో నిలయము సత్య సంపదకు నీ భజనావలి
వేంకటేశ్వరా! |
4.
|
|
|
|
|
సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక
నిభాక్షియుగ్మ పా రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ
నితాంత గాత్ర మా నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస
మూర్తివే నందిత పద్మగర్భ సురనాథ మహేశ్వర
వేంకటేశ్వరా! |
5.
|
|
|
|
|
శ్వేత వరాహ ధారణ నభేద్య నిశాటు
హిరణ్య నేత్రునిం బ్రీతి నొసంగఁ గంజునకు భీకర లీల
వధించియున్ యథా రీతిని నిల్పి భూమిని విరించి మహేశ్వర వాంఛ తీర్పఁగన్ భాతిని నిల్చితే కలిని భక్తులఁ బ్రోవఁగ
వేంకటేశ్వరా! |
6.
|
|
|
|
|
మోదము గూర్ప జానకికిఁ బుణ్య చరిత్ర దశాస్య ధర్షితన్ వేదవతీ సతిన్ వమియ
వింతగ సీతగ మార్చి నిల్ప శా తోదరి లంకయం దిడుము లొంద వరంబు
నొసంగి రాముఁడే వేదనఁ దీర్పఁ బద్మ యనఁ బృధ్వినిఁ బుట్టెను వేంకటేశ్వరా! |
7.
|
|
|
|
|
భామలఁ గూడి పద్మజ నభఃపతి నందన
సంచరింపఁగన్ భీమ కరీంద్రుఁ డుగ్రుఁ డయి భీతిలఁ
జేసెఁ గరేణు యుక్తమై యా మద హస్తి నిన్నుఁ గని యాదర మొప్ప
నమస్కరించెనే నీ మహిమల్ విచిత్రములు నీరజ లోచన వేంకటేశ్వరా! |
8.
|
|
|
|
|
చెలువము మిన్ను మీఱఁగ నశేష జనాళినిఁ
బ్రోవ నెంచి డా పల దరి భూరి భూసతియు పద్మదళాలయ
దక్షిణంబునన్ సలలిత భామ లిద్దరును సన్నుతి సేయుచు
నిన్ భజింపఁగం గలియుగ మందు నిల్చితివి కామిత దాయివి వేంకటేశ్వరా! |
9.
|
|
|
|
|
అన్నియు నీవ యంచు హృదయాంతర మందును నిల్పి భక్తితోఁ
గన్నుల నీరు నిండఁగ వికారము లన్నియు
వీడి వేడ నా పన్నుల దుఃఖనాశనము పన్నుగఁ జేసి
తరింపఁ జేయవే సన్నత దేవదేవ విధి శక్ర ముఖామర!
వేంకటేశ్వరా! |
10. |
|
|
|
|
లాభము లేని వర్తకము లౌకిక సౌఖ్యము
లిచ్చు విద్యలున్ లోభికి నున్న సంపదయు లోక మెఱుంగని కావ్య సృష్టియుం బ్రాభవ మెంత యున్నఁ దవ పావన పూజలు లేని గేహముల్ వైభవముల్ నిరంతరము వ్యర్థములే చుమి
వేంకటేశ్వరా! |
11.
|
|
|
|
|
మానుగ భాషణమ్ములను మానవు లందరితోఁ
జరించితే మానని తొండమానుని ప్రమాదపుఁ జర్యలు గాంచి వేదనన్ మౌనముఁ బూని నిత్యమును మర్త్యుల కింక
నగోచరుండవై యా నగ సప్త వల్లభుఁడ వైతివి చిత్రము వేంకటేశ్వరా! |
12. |
|
|
|
|
ఘనములు కల్గు నత్తరి సుఖమ్ములఁ
దేలెడు వేళ బంధువుల్ తనయులు దార తోడ ధనధాన్యము లాదిగఁ బెక్కు లుండగన్ నిను మది భక్తితోఁ గొలువ నేరక పాప ఫలమ్ముఁ బొందినన్ ఘనముగ దుర్గతిన్ వెతలఁ గందుదు రెల్లరు వేంకటేశ్వరా! |
13. |
|
|
|
|
పాచిక లాడ నేర్తునె యపార కవిత్వ
పటుత్వ సంపద న్నీచరణారవిందముల నేర్పుగఁ గీర్తన
సేయ నోపనే తూఁచుట నేర విత్తములఁ దోరముగా నిను నే విధంబునం గాచుట నేర్తు వయ్య ననుఁ గంజ దళాంబక వేంకటేశ్వరా! |
14. |
|
|
|
|
మరలక వ్యూహలక్ష్మి యను మంత్రము
పుణ్యతమంబు పాడఁగన్ విరివిగ నాత్మ రాముఁ డను విప్రుఁడు
పూర్వ భవాఘ తప్తుఁడున్ సురుచిర సంపదోఘములఁ జోద్యము మీఱఁగ నందెనే శుభం కరమగు నీదు సత్కృపను గారవ మొప్పఁగ వేంకటేశ్వరా! |
15. |
|
|
|
|
చేవ నొసంగి స్వామిగను జేయు తటాకము
తాన మాడినం గావున స్వామి పుష్కరిణి గా
వచియింతురు నెమ్మి
దీనినే క్ష్మావిభుఁ డయ్యె శంఖణుఁడు స్నానము సేయఁగ భ్రష్ట భూమికిం బావన వారిజౌక పరిపాలన వైభవ వేంకటేశ్వరా! |
16. |
|
|
|
|
తలఁచెద శ్రీసతీ రమణుఁ దాపస మానస
పారిజాతముం బలికెద వేంకటాచల నివాస మనోహర కీర్తనావళుల్ కొలిచెద నర్థిలోక వరగుప్తి శుభప్రద దివ్యహస్తునిన్ విలసిత కాశ్యపేయ పరివేష్టిత సన్నుత వేంకటేశ్వరా! |
17. |
|
|
|
|
భవ్యము మంగళప్రదము భాసిల వక్షము నందు
లక్ష్మియున్ దివ్యము నీదు దర్శనము దీన జనోద్ధరణప్రకాశమున్ శ్రావ్యము నీ చరిత్రము పరాత్పర! సన్నుత! భక్తవత్సలా! యవ్యయ! సంకటాపహర! యజ్ఞవరాహమ! వేంకటేశ్వరా! |
18. |
|
|
|
|
గాయక మెంచఁగం గృత యుగంబున నంజన శైల
మందుఁ ద్రే తాయుగ మందు విష్ణువు నితాంత రతిన్
వసియించు నండ్రు నా రాయణ శృంగి సింహగిరి రంజిలు ద్వాపర
మందునం గలిం బాయని కీర్తి వేంకటపుఁ
బర్వత మందును వేంకటేశ్వరా! |
19. |
|
|
|
|
భూరి కుమార ధారిక నపూర్వ తటాక నిమజ్జనంబు స త్పూర సురాపగాది నద పుణ్య నిమజ్జన
తుల్యమట్టి కా సార తటీ స్థితాగ్నిభవ సన్నుత హర్షణ
దీన రక్షకా భారము నీద యంచు మదిఁ బన్నుగఁ
గొల్తుము వేంకటేశ్వరా! |
20. |
|
|
|
|
దినకరుఁ డుండ కుంభమున దివ్యము మాఘపుఁ
బౌర్ణిమా తిథిం దనర మఘాభ మత్తఱిని దర్పము వీడి కుమార
ధారికన్ మునుఁగఁగ మధ్య ఘస్రమునఁ బుణ్య ఫలమ్ము ప్రకాశమౌ నటం గనికర మొప్పఁ గాచెదవు కంటికి రెప్పగ వేంకటేశ్వరా! |
21. |
|
|
|
|
అంబర రత్న మింపుగ విహారము సేయఁగ మీన
రాశిలోఁ దుంబుర తీర్థ తోయములఁ దోఁగఁగ భక్తినిఁ బౌర్ణమీ తిధిన్ సంబర మొప్ప ద్వాదశ భ సంయుత తుర్యపుఁ గాల మందు నే యంబల గర్భ జన్మములు నంటవు నీ దయ వేంకటేశ్వరా! [ద్వాదశభ=12వ నక్షత్రము,
ఉత్తరఫల్గుని ;
తుర్యపుఁ
గా లము = నాల్గవ దైన బ్రహ్మ ముహూర్తము,
తెల్లవారుఝాము] |
22. |
|
|
|
|
శూరుఁడు మేష రాశిఁ గన శూరతఁ బున్నమి
నాటి వేకువం బారఁగ చిత్త యత్తఱిని బాంధవ నందన దార యుక్తమై గౌరవ మొప్పగన్ గగన గంగ సరోవర మందుఁ దోఁగఁగన్
మూరిన ప్రేమ నిచ్చెదవు మోక్షము మా కిల
వేంకటేశ్వరా! |
23. |
|
|
|
|
మిహిరుఁడు
వాహ రాశిఁ జన మింటిని ద్వాదశి శుక్ల కృష్ణలన్ మిహిర
కుజాఖ్య వారములు మేలుగ పాండవ తీర్థ మందు నీ యిహమున
దుఃఖ నాశనము నింక పరమ్మున సౌఖ్య రాశులున్ సహనము
తోడఁ దోఁగఁగను జక్కఁగ నిత్తువు వేంకటేశ్వరా! |
24. |
|
|
|
|
నియతిని సప్తమీ తిధిని నిర్మలుఁ డై
రవివార మందు హ స్త యుతము నైన నుత్తమపుఁ దారల నైనను దోఁగినన్ సుధా మయ జలమం దనంత గిరి మస్తక నిర్ఝర
పాపనాశ నా హ్వయమునఁ గోటి జన్మ కృత పాపము లుక్కును వేంకటేశ్వరా! [అనంతగిరి=శేషాచలము] |
25. |
|
|
|
|
గురు వటఁ బుష్య యోగమునఁ గూడఁగ నా శ్రవణా భ యుక్తమై పరఁగెడు సోమ వారమునఁ బన్నుగఁ దోఁగఁగ
దేవ తీర్థమం దు రమణఁ గల్గు నెల్లరకుఁ దోరపు
టాయువులుం గులాభి వృ ద్ధి రుచిర తోక మింపుగఁ ద్వదీయ దయేక్షణ వేంకటేశ్వరా! |
26. |
|
|
|
|
బాలుని రంగదాసుని విభాసిత కాయుని
భక్తశేఖరుం బాలిత పుష్పధామ సుమభవ్యసుదామ సమర్పణార్థి స త్శీలుని స్వామిపాద నత శీర్షుని భావిజ
తొండమానునిన్ మేలుగఁ గాచి తీవు పరమేష్ఠి సుపూజిత
వేంకటేశ్వరా! |
27. |
|
|
|
|
కేకి లలామ నిత్య పరికీర్తిత తోషణ!
నీరజాక్ష! వ ల్మీక నిగూఢపాద! సకిరీట వరాభర ణోజ్జ్వ లాంగకా! ప్రాకట శంఖ చక్ర సుకరండ గదాయుధ హస్త
భూషితా! శ్రీకర! భూ రమావిరళ సేవిత! కావవె వేంకటేశ్వరా! |
28. |
|
|
|
|
శ్రీసతి పూర్వ మొక్క తఱిఁ జిత్రముగన్ ముని శేఖరుండు దు ర్వాసుని ఘోర శాపమునఁ బద్మదలాక్షుఁడు తోడు రాఁగ భూ వాసిగఁ జేసె సంయతినిఁ బద్మ సరోవర వాటికా తటిన్ వాసికి నెక్కె నక్కొలను పాపహరంబుగ వేంకటేశ్వరా! |
29. |
|
|
|
|
భూరి వరాహ రూపమున బోయని క్షేత్రపు
శాలి ధాన్యముం గోరి భుజింపఁ బాదముల గుర్తులు సూచి
నిషాదుఁ డేఁగి యా దారినఁ బుట్ట లోనఁ గిటిఁ దాఁ గని త్రవ్వఁగ మూర్ఛ సెందెనే నేరఁడు నిన్నిలన్ వసువు నేరము సైచితి
వేంకటేశ్వరా! |
30. |
|
|
|
|
చెప్పితి వీవు పుత్రుఁడు భజింప
నిషాదుని నావహించి మీ రిప్పుడ యేఁగి తెల్పుఁ డిటు లిప్పుర
నాథుఁడు తొండమాన్ ఘనుం డొప్పుగఁ బుట్టనుం గడుగ నుత్తమ నీలపు
గో పయస్సునం జప్పునఁ గాంతు రొక్క శిలఁ జక్కఁగ నంచును వేంకటేశ్వరా! |
31. |
|
|
|
|
ఖోలక మందునున్న శిలఁ గూర్మినిఁ దీసి
వరాహ వక్త్రమున్ లీలగ నంక పీఠ తట లేఖిత భూసతి రూపు భాసిలన్ మేలుగఁ జెక్క స్థాపితము మేదినిఁ
జేసెను తొండమానుఁడుం బూలను భవ్య పత్రములఁ బూజలు సల్పుచు వేంకటేశ్వరా! |
32. |
|
|
|
|
పాద యుగంబు పుట్ట నిరపాయము దాఁగిన శ్రీనివాసునిన్ మోదము మీఱఁ గాంచి పదముల్ పరిశుభ్రము సేసి పాల నా మోదిత వేదమంత్రములఁ బూజలు సల్పి
చరింప భక్తితో మేదినిఁ దొండమానుఁ డట మీ దయఁ బొందెను
వేంకటేశ్వరా! |
33. |
|
|
|
|
గౌరవ చించ చంపక నగమ్ములు వేంకట నాథ
మాధవ శ్రీరమ వాసయోగ్యముల రెంటిని దక్క
నగాన్య భేదముం గూరిమిఁ దొండమానుఁ డిలఁ గోర రమేశుఁడు
స్వప్నమందుఁ బ్రా కారము నంత రమ్యముగఁ గట్టెను ధన్యత వేంకటేశ్వరా! |
34. |
|
|
|
|
నేరుగ రాజ మందిర వినిర్గత భవ్య బిలంపు మార్గ మిం పారఁగఁ జేసి యద్రికి నిజాత్మజ
దార స బంధు వర్గ మా వీరుఁడు తొండమానుఁ డల వేంకట నాథ పదాబ్జ పూజలన్ గౌరవ మొప్పఁ జేయుచు సుఖమ్ములఁ దేలెను వేంకటేశ్వరా! |
35. |
|
|
|
|
ఆయత చంద్ర వంశజుఁడు నాతత కీర్తి
విభూషణుండు నా రాయణ నామధేయుఁడు విరాజిత శీలుఁడు
పుణ్యమూర్తియుం బాయని భక్తి నేర్పఱచె స్వర్ణ విమానము వేంకటాద్రిలో ధ్యేయము నెల్ల భక్తులకు దివ్య నిధానము వేంకటేశ్వరా! |
36. |
|
|
|
|
కుర్వ నివాసి యుత్తముఁడుఁ గుమ్మరి
భీముఁడు దైవ భక్తుఁడున్ సర్వము విష్ణు మూలమని సన్మతి మృణ్మయ
పత్ర రాజితో గర్వము వీడి కొల్వఁగ సకాంతయ చేరెను విష్ణు లోకమున్ సర్వ ఖలవ్యయమ్మునను సత్వర మింపుగ వేంకటేశ్వరా! |
37. |
|
|
|
|
పుణ్య తమమ్ము లయ్య మధు పూరిత తావక
నామ కీర్తనల్ గణ్యము గాదు మీ దగు నఖండ మహాత్మ్యము
నేరికిన్ ఘనా రణ్యము లందు నున్నను సురక్షితులే
భవదీయ భవ్య కా రుణ్య వితాన మున్న నిల లోక సురక్షక వేంకటేశ్వరా! |
38. |
|
|
|
|
శేష నగాధి వాస రత! శీఘ్ర వృషాక్షి సుగోచరా!
సదా తోషద నాథఖాత తట! తోయజ నేత్ర! సుమేరు పుత్ర సం తోషద శైలనాథ! లసదుత్తమ విష్ణు సదాభిధాన! సం భాషణ భవ్య పుష్ప యుత వాత సుపూజిత! వేంకటేశ్వరా! [వృషాక్షిసుగోచరా
= వృషదృగ్గోచరా; నాథ ఖాతము= స్వామి పుష్కరణి; సుమేరుపుత్ర
సంతోషద శైలనాథ = మేరుపుత్రగిరీశా అష్టోత్తర శత
నామములు: ఓం నమో వేఙ్కటేశాయ; శేషాద్రి
నిలయాయ; వృష దృగ్గోచ రాయ; సరస్స్వామి తటీ జుషే; మేరు పుత్ర గిరీశాయ; విష్ణవే; సదా వాయు స్తుతాయ; 7 నామములు] |
39. |
|
|
|
|
నిత్య కుమార సేవ్య! రమణీయ గిరీంద్ర
నికుంజ సంచరా! సత్య పరాక్రమ త్రిదశ సన్నుత రామ!
బలారి గోచరా! దైత్య కదంబ నిర్దళన! తార్క్ష్య మహీధర వాస హర్షితా త్మ! త్యజి తాక్షయస్థల! రమా స్థ
భుజాంతర! వేంకటేశ్వరా! [కుమారాకల్పసేవ్యాయ; గిరికుఞ్జవిహారిణే; రామాయ; వజ్రి
దృగ్విషయాయ; దైత్యసఙ్ఘప్రణాశినే; తార్క్ష్యాచలనివాసినే; త్యక్త
వైకుణ్ఠలోకాయ;
అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే; 8] |
40. |
|
|
|
|
శాశ్వత! పద్మనాభ! హరిచందన
గోత్రవరాధినాథ! స ర్వేశ్వర! శంఖ చక్ర యుగళేద్ధ
కరాంబుజ! శంఖ రాజరా జేశ్వర నేత్ర గోచర! మునీశ్వర సంచయ
పూజి తాగ్రణీ! శశ్వదభీష్టదాత! సురసన్నుత! కేశవ!
వేంకటేశ్వరా! [నిత్యాయ; పద్మనాభాయ; హరిచన్దనగోత్రేన్ద్రస్వామినే; శఙ్ఖచక్ర వరానమ్ర
లసత్కరతలాయ;
శఙ్ఖరాజన్యనేత్రాబ్జ
విషయాయ;
సనకాదిమహాయోగిపూజితాయ; కేశవాయ; వేఙ్కటాయ; 8]
|
41. |
|
|
|
|
శ్రీగిరి సన్నివాస! నిజ శేషనగాకృతి
దర్శనాతురా! శ్రీ గురుమానసాపహర! శీర్షసహస్ర! సహస్రపాద! రూ ప్యాగమ నాథ సేవ్య! చతురాస్య సు
రాసహ విశ్వరూప! స ద్భాగవతేష్టదాయక! కృపారసవీక్షణ! వేంకటేశ్వరా! [రూప్యాగమనాథ = శంకరుఁడు; శ్రీశైలనిలయాయ;
శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ; ; అనంతశిరసే; అనంతచరణాయ; శఙ్కరధ్యాతమూర్తయే; బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ; 6] |
42. |
|
|
|
|
మోద సువర్చలా సుత చమూ భర! సంయమి బృంద సేవ్య! దా మోదర! కృష్ణ! గూఢ పర మోత్తమ భవ్య విమాన
భాసితా! సాదర వైనతేయ సుభుజాసన! చందన లిప్త విగ్ర హా మోద! హరి! ప్రియంగు ఘన భుక్ప్రియ!
శ్రీధర! వేంకటేశ్వరా! [సువర్చలాసుతన్యస్తసైనాపత్యభరాయ; వైఖానసమునిశ్రేష్టపూజితాయ; దామోదరాయ; కృష్ణాయ; మాయాగూఢవిమానాయ; గరుడ స్కంధవాసినే; ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ; హరయే; ప్రియఙ్గుప్రియభక్షాయ; శ్రీధరాయ; 10] |
43. |
|
|
|
|
వారిద సన్నిభ ద్యుతి సువర్ణ వరాంగ!
సహస్రలోచనా! కీర వసూరు రక్షక! సుకీర్తిత కుంభ భవాక్షి గోచరా! సార ధరాధరాంచిత విశాల సుసాను తల ప్రతిష్ఠి
తా గారి వరా! పరాత్పర! ఘనాఘ వినాశన! వేంకటేశ్వరా! [కీర వసు+ఉరు
రక్షక =కీరవసూరురక్షక: వసూపరిచరత్రాత(ఉపరిచరము=పక్షి): పంచవర్ణపు చిలుకను, వసువును
రక్షించిన వాడు) ; కుంభభవుడు=
అగస్త్యుడు;
సానుతలప్రతిష్ఠిత +అగ+అరి (అగము = పాము): సానుస్థాపిత
తార్క్ష్యాయ. నీలమేఘనిభాయ; అనన్తాక్షాయ;
వసూపరిచరత్రాతే; అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ;సానుస్థాపిత తార్క్ష్యాయ; మహతే; 6] |
44. |
|
|
|
|
నీరజనేత్ర! సత్యపుర నిర్గత హేమ విమాన
సంగతా! సారస సంభ వానిమిష సద్గురు దాత! శశాంక
రూపదా! కారణ కార్య హేతుక! మృకండజ తీర్థజ
పుణ్యదాయకా! వారిజ గర్భ హస్త కృత భవ్య మహోత్సవ!
వేంకటేశ్వరా! [వైకుణ్ఠాగతసద్ధేమవిమానాన్తర్గతాయ;
వాక్పతిబ్రహ్మదాత్రే; చన్ద్రలావణ్యదాయినే;
మార్కణ్డేయమహాతీర్థజాత పుణ్యప్రదాయ; బ్రహ్మక్లప్తోత్సవాయ;
5] |
45. |
|
|
|
|
ప్రాకట ఘోర దుష్ట జన భంజన! కచ్ఛప మూర్తి
భాసితా! మూక సురూప భాసిత! విమోచిత సత్య పురార్చి తాంఘ్రి
రా జాకర ఘాత రామ! చది రాశన గోత్ర నివాస తోషితా! శ్రీకర! పాండవారి హర! సింహ సుమధ్యమ!
వేంకటేశ్వరా! [మూకము =చేప; దుర్మేధఃప్రాణహర్త్రే; కూర్మ
మూర్తయే; మత్స్యరూపాయ; శ్వేత ద్వీప వసన్ముక్తపూజితాఙ్ఘ్రియుగాయ; క్షత్రియాన్తకరామాయ; సింహాచలనివాసాయ; శ్రీకరాయ;
పాణ్డవారిప్రహర్త్రే; 8] |
46. |
|
|
|
|
ఆయత వాయు నందన వరాతత దాయక! వాసుదేవ! నా రాయణ శైలవాస! మిథిలాధిప తీష్టద!
నిత్య యౌవనా! మేయ వృషాసు రాంబుద సమీరణ! భక్త జనార్థి
తార్థ సం ధాయక! తీర్థ పంచక సుధామ! సునిశ్చల!
వేంకటేశ్వరా! [నిశ్చలుఁడు = విభవుఁడు; అఞ్జనాసుతదాత్రే; వాసుదేవాయ;నారాయణనగేశాయ;
జనకేష్టప్రదాయ;
నిత్యయౌవనమూర్తయే; వృషభాసురహారిణే; అర్థితార్థ ప్రదాత్రే; తీర్థపఞ్చకవాసినే; విభవే; 9] |
47. |
|
|
|
|
భాసుర జానుదఘ్నభవ భవ్యవరాహ!
కుమారధారికా వాస మయూరకేతు చిరభవ్యవరప్రద!
సేవ్యరుద్ర భా మా సుత నాథతీర్థవర మజ్జన లోక
హితప్రదాయకా! శాసిత పంచ బాణ ఘన సత్సఖ! మాధవ! వేంకటేశ్వరా! [జానుదఘ్న=మోఁకాటి లోఁతు; జానుదఘ్నసముద్భూతపోత్రిణే;
కుమారధారికావాస స్కన్దాభీష్టప్రదాయ;
తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే; వామదేవప్రియాయ; 4] |
48. |
|
|
|
|
అంజన గోత్రనాథ! కుము దాక్ష గణ ధ్వజినీ విభుత్వ ధృ ద్రంజన దాయకా! మృగ సురంజన! కిన్నర యుగ్మ
శాప స ద్భంజన! విశ్వతీర్థ దురితఘ్న! సపర్వత
దేశ మందిరా! కంజజ మాతృ హస్తకద కైరవ మాలిక! వేంకటేశ్వరా! [మృగసురంజన=మృగయారసిక; సపర్వత
దేశమందిరా=ఉపత్యకాప్రదేశస్థ; అఞ్జనాగోత్రపతయే; కుముదాక్షగణశ్రేష్టసైనాపత్యప్రదాయ; మృగయారసికాయ;
కిన్నరద్వన్ద్వ శాపాన్తప్రదాత్రే; విశ్వతీర్థాఘహారిణే (సమస్త
రజఃపాపములు];
ఉపత్యకాప్రదేశస్థ; లసల్లక్ష్మీ
కరామ్భోజ దత్త కల్హారకస్రజే; 7] |
49. |
|
|
|
|
పావన పాండుకోల వర! భక్త సుగోచర!
విష్ణు శైల స జ్జీవన! రుక్మ పద్మ సరసీ తటి మాకృత సంయతీష్ట! సం సేవక నీలకంఠ నరసింహ! వృషాద్రి నివాస తోషితా! సేవక మాధవీయ ఖల భేదన రంజన! వేంకటేశ్వరా! [పాండుకోలవర:శ్వేతవరాహము; విష్ణుశైలము=సాలగ్రామము; మాకృత=లక్ష్మీకృత;
శ్వేతకోలవరాయ;
నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ; సాలగ్రామనివాసాయ; రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే; సద్భక్తనీల కంఠార్చ్యనృసింహాయ;
వృషభాచలవాసినే;
మాధవీయాఘహారిణే; 7] |
50. |
|
|
|
|
ప్రాభవ ధర్మసంచరిత భక్త సుచేతన
దాయకార్త! నా గాభరణేష్టమిత్ర! కుముఖాచల వల్లభ!
నీలధేను దు గ్ధాభిష వాంగ సంభవ! సదాచ్యుత ! చోళ
సుతప్రియా! హిర ణ్యాభరణ ప్రభా విలసి తాజిర! మధ్వరి!
వేంకటేశ్వరా! [కుముఖాచలము=వరాహాచలము; అభిషవము=
స్నానము. సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే; శఙ్కరప్రియమిత్రాయ;
వరాహాచలనాథాయ; నీలధేను
పయోధారాసేక దేహోద్భవాయ; అచ్యుతాయ;
చోళపుత్రప్రియాయ; మధుఘాతినే; 7] |
51. |
|
|
|
|
అంత విహీన! గోగణవరాధిప! కృష్ణసమాహ్వ
విప్ర వే దాంత సుదేశికత్వద! ఘనాసిత శైల
నివేశన! ప్రలం బాంతక దివ్య తీర్థ సకలాంచిత పుణ్యవితాన దాయి! స్వా నంత విలాస శయ్య! వర నంద సునందన! వేంకటేశ్వరా! [అనన్తాయ; గోవిన్దాయ;
కృష్ణాఖ్యవిప్రవేదాన్తదేశికత్వప్రదాయ; నీలాద్రినిలయాయ; హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే; 5] |
52. |
|
|
|
|
యాదవ శేఖరా! నలిన జార్థిత సత్కృత
సౌమ్య రూప! స మ్మోదిత మేదినీ! ధవళ పూర్ణ పయోధి మనోహరా! హృషీ కోదిత పాలకా! త్రిజగ దుత్థిత వామన! సత్య పట్ట ణా చ్ఛాదిత శైలవాస! బలసంయుత విగ్రహ!
వేంకటేశ్వరా! [విరిఞ్చాభ్యర్థితా౽నీతసౌమ్యరూపాయ;
క్షీరాబ్ధినాథాయ; హృషీకేశాయ;
త్రివిక్రమాయ;
వైకుణ్ఠాచలవాసినే; బలభద్రాయ; 6] |
53. |
|
|
|
|
ప్రాయ కృతాఘ నాశక సువర్ణముఖీ
జలకార్థి దాత! నా రాయణ! నారసింహ రుచి రంజిత భార్గవి!
శ్రీనివాస! ప ద్మాయత పత్ర నేత్ర! పరమాత్మ! ముకుంద! శుకాక్షిగోచరా! సాయక ఖండి తాజిర నిశాచర! రాఘవ!
వేంకటేశ్వరా! [సువర్ణముఖరీస్నాతమానుజాభీష్టదాయినే; శ్రీమన్నారాయణాయ; శ్రీనివాసాయ; ముకున్దాయ;
శుకదృగ్గోచరాయ;
5;
మొత్తము 108 నామములు] |
54. |
|
|
|
|
కల నయినం ద్వదీయ భవ ఖండన దర్శన భాగ్య
మీయవే పలుకుల చేత నైన నిను బన్నుగఁ గీర్తన సేయ నోఁచనే తలఁపుల యందు నిల్పినను దాపము బాప
విలంబ మేలనో చులకన చూపు లేల దయఁ జూడవె దీనుని
వేంకటేశ్వరా! |
55. |
|
|
|
|
నగముల నేడు నొక్క త్రుటి నర్తన లీలగ
నెక్క వచ్చునే జగములఁ గల్గు వేదనలు సన్నుతి సేయఁగఁ దీర కుండునే విగతము లన్ని పాపములు వేడిన నిశ్చల
భక్తి నెమ్మదిన్ నగవులు చిందు నీ ముఖమె నా కగు
దిక్కిల వేంకటేశ్వరా! |
56. |
|
|
|
|
సంతస మంద నేరవు యశస్కర వైభవ పూజ నాదులం బంతము లన్ని వీడి కడు భక్తిని బత్రము తోయమో తమిన్ సుంతయు నిచ్చి నంత పరిశుద్ధ మనంబున సంతసింతువే వింతలు నీ మహాత్మ్యము లవేద్యము
లిద్ధర వేంకటేశ్వరా! |
57. |
|
|
|
|
సంపద కాలవాల మగు సాగర నందన నీ
యురమ్మునన్ సొంపున నుండ కుక్షి ఘన శుంభ దజాండము నిండి యుండగం బెంపున నప్పు నీయఁగఁ గుబేరుని వైభవ మెంత? వింతయే! యింపిఁడి వడ్డి కాసులన నేమని
చెప్పుదు! వేంకటేశ్వరా! |
58. |
|
|
|
|
ఆపద నుత్తరింపు మని యార్తిని
మ్రొక్కుల నిత్తు మందురే కోపము కల్గు నేమొ యని కుందుదు
రెల్లరు తీర్పకుండినం బాప మెఱుంగ నేరరు కృపారస చిత్తున
కేల మ్రొక్కులున్ నీ పద యుగ్మ మింక మది నిల్పినఁ జాలదె
వేంకటేశ్వరా! |
59. |
|
|
|
|
సుందర మైన రూప మది చూచిన నిత్యము
తన్వి తీరునే విందులు సేయు కీర్తనలు వీనుల
కెప్పుడు మోహనమ్ముగన్ డెందము నందు విగ్రహము ఠీవిగ నిల్చు
నిరంతరమ్ము నే మందుము నిత్య నూతన మహాద్భుత లీలల
వేంకటేశ్వరా! |
60. |
|
|
|
|
బాల్యము నందు నేరకయుఁ బ్రాయము నందును విద్యలందు మాం గల్యపు మోహ మందు నిఁకఁ గాపురపుం బటు
బాధ లందునున్ శల్యము లౌను గాయములు సాగఁగ నీ విధి
వార లింకఁ గై వల్యము గోరి నిం గొలువ వచ్చెద రెన్నఁడు వేంకటేశ్వరా! |
61. |
|
|
|
|
చిత్ర విచిత్ర నామముల సేవలు సల్పుదు
రెల్ల వేళలన్ గోత్ర సమేత నామములఁ గొల్తురు నిత్యము
పారవశ్యతం బాత్రము వేద ధర్మ పరిపాలన కెన్నఁగ వేంకటాద్రి స ద్గోత్రము నిత్య మంగళ వికుంఠము ధాత్రిని వేంకటేశ్వరా! |
62. |
|
|
|
|
లంచమ యంచు నెంచక విలాసముగా
వచియింత్రు మ్రొక్కులే యంచును జెంతఁ జేరి మది నార్తిని
మ్రొక్కిన దేవ దేవునిం గాంచరె సర్వ దుఃఖముల ఖండన సందియ మేల నేరికిన్ వంచన లేల చిత్తమున భక్తియ చాలదె
వేంకటేశ్వరా! |
63. |
|
|
|
|
కానుక లేమి యిచ్చెనట కానల శంఖణుఁ డొందె
రాజ్యమున్ మానుగ కుంభ కారుఁ డల మాడల నిచ్చెనె
భీముఁ డెన్నఁడున్ దేనికి తింటి వా చెఱకు దీటగు
సొమ్ములు బాబ యిచ్చెనే కానము నేడు సన్మతులఁ గాంచము వింతల
వేంకటేశ్వరా! |
64. |
|
|
|
|
కరుణయె తప్ప నన్యమును గానము దీన
జనమ్ము లందునున్ వరముల నిచ్చి కాచెదవు భక్తుల నింపుగ
వేడి నంతనే తరణము నామ కీర్తనము తామరసాక్ష భవాబ్ధి
కిద్ధరన్ స్థిరముగ నీదు పూజలను జేయుదు భక్తిని
వేంకటేశ్వరా! |
65. |
|
|
|
|
వినవలె నీదు కీర్తనలు వీనుల విందుగ
నాట్య మాడుచుం గనవలె దివ్య రూపమును గన్నుల కింపుగ సంతసమ్మునన్ మునుకలు వేయఁగా వలెను బుష్కరిణీ జల
మందు భక్తితో మనమున నిల్పఁగా వలెను మంగళ రూపము వేంకటేశ్వరా! |
66. |
|
|
|
|
శ్లోక చతుష్టయమ్ములను సూర్య కులోద్భవ
చక్రవర్తి సు శ్లోకుఁడు ప్రస్తుతింప ఘన శోక పరీత
మనస్కుఁడై తదీ యాకుల చిత్తు నా దశర థాఖ్యుని పుత్ర
చతుష్టయమ్మునన్ వే కరుణించితే విమల వేంకట శృంగిని
వేంకటేశ్వరా! |
67. |
|
|
|
|
కుందన మంత శుద్ధము వికుంఠపు
టయ్యయిరంమదమ్ము నే యందఱు స్వామి పుష్కరిణి యందురు భాసిల వేంకటాద్రిలో నెందు మునంగఁ బాపములు హీనము లౌ నిల
నద్భుతమ్ముగన్ సందియ మల్పముం గనము సన్నుత శంకర
వేంకటేశ్వరా! |
68. |
|
|
|
|
వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ
బ్రోచెడు దైవ ముండఁగా నరబలు లిచ్చి క్షుద్ర సుర నైరృత
పూజలు సల్ప నేర్తురే గరళముఁ గ్రోలఁ జూచెదరు కమ్మని పాలను విస్మరించియున్ గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేఁడక వేంకటేశ్వరా! |
69. |
|
|
|
|
ముదముగ బ్రహ్మ కల్పిత మపూర్వ మహోత్సవ
మందు నొక్క రో జు దరల నశ్వరాజమున శోభిల నేనిక నొక్క రోజునన్ సృదర విహార మొక్క పరి చెన్నుగఁ దార్క్ష్యు
రథంబు నందునం బదపడి యొక్క రోజునను వర్తిలు చుందువు
వేంకటేశ్వరా! |
70. |
|
|
|
|
అల నలమేలు మంగపుర మందు సుచందన
చర్చితాంగియై మిలమిల కాంతులన్ మెఱయు మేలిమి భూషణ
వస్త్రధారణం గలవర మందు భక్తజన కామిత దాత్రి యనంగ భాసిలం జెలువముఁ జూపు నా సతినిఁ జేరఁగ
వత్తువు వేంకటేశ్వరా! |
71. |
|
|
|
|
రాముఁడు దైత్య హత్యలకు రమ్యపు టంజన శైల మందు నా రామము నందు నంజన కరమ్ములఁ బూజల నంది
విప్రు ని ర్లోముని వేంకటాద్రిని విలోకన
ముక్తుని జేసి భక్తినిం దా మునుఁగంగఁ బుష్కరిణిఁ దత్ఫల
మందెను వేంకటేశ్వరా! |
72. |
|
|
|
|
అంతము సేసి దైత్యుని బలాన్విత మూర్ఖు
హిరణ్య నేత్రుఁ గ ల్పాంతము వేంకటాద్రిని మహామహి మాన్విత
శైల మందునున్ శాంత దయా గుణప్రతతి సాగర నందన భూసతీ
యుతం బెంతయుఁ బ్రీతి నుందు నని యేర్పడ నంటివి వేంకటేశ్వరా! |
73. |
|
|
|
|
మేదిని వేంకటాచలము మిక్కిలి మక్కువ
సత్యలోకమున్ మోదపు నాకలోకము నపూర్వపు సూర్య
జగమ్ము కన్ననున్ శ్రీదయితుండు నా హరికి శ్రీయుత
ముండును శ్రీనివాసుఁ డీ వేద మయోర్వి భక్తుల కభీప్సిత దాతగ
వేంకటేశ్వరా! |
74. |
|
|
|
|
కందర నిర్ఝ రావృతము క్ష్మాజ మృగద్విజ
సంకులమ్మునౌ సుందర నంద నోపమ విశుద్ధ జలాశయ వాటికా
తటీం దిందిర నాద మోదితము దివ్యము నబ్జజ
సేవితమ్మునౌ సుందర వేంకటాచలము సూక్ష్మమె యిద్ధర
వేంకటేశ్వరా! |
75. |
|
|
|
|
ఆయత మాననీయ వృషభాచల మంచిత వేంకటాద్రి
నా రాయణ శైల రాజము విరాజిత శేష మహీ ధరమ్ము
నీ యాయత మంజనాద్రి గరుడాద్రి వృషాగము లందు నిత్యముం బాయక యుందు విమ్ముగను భక్త జనాశ్రయ
వేంకటేశ్వరా! |
76. |
|
|
|
|
సుమసమ కోమలాంగమున సుందర బాలుని లీల
దాను దోఁ ప మసలు వేంకటాధిపతి బాఁపఁడు సమ్మతి వృద్ధుఁ డంత స్నా నము దగఁ జేయ యౌవనము నన్విలసిల్లఁగ నా
తటాకమే విమల కుమార ధార యన విశ్రుత మయ్యెను
వేంకటేశ్వరా! |
77. |
|
|
|
|
ఉరుతర మోద చిత్తమున నుత్తర పూర్వ
దిశాధినేత శం కరుఁ డట వేంకటాచల వికాసిత దక్షిణ
పూర్వ దిక్కునన్ గిరిధర సమ్మతమ్మునను గేశవ మిత్రుఁడు వాస ముండగన్ వరముల కేమి తక్కువట భక్త జనాళికి
వేంకటేశ్వరా! |
78. |
|
|
|
|
వేంకట నాథ తుల్యుఁడు నభీప్సిత దాయక దైవ ముండునే సంకట షండ భంజనుఁడు సచ్ఛరణాగత రక్షకుండు
స త్కింకర వత్సలుండు ఘన తీర్థ విలాసిత
నాథుఁ డుండునే పంకజ ఫుల్ల నేత్ర! భవ వారిధి తారక!
వేంకటేశ్వరా! |
79. |
|
|
|
|
గుంభన భర్మ సానువులఁ గూడియు వైభవ
వేంకటాద్రి సం రంభ మొకింత లేక కడుఁ బ్రాకృత శైలపు
రీతిఁ దోఁచు నీ కుంభిని సర్వ మానవులకుం బరమాంచిత శైల
రాజమే స్తంభిత ఘోరదైత్యగణ! సన్నత నిర్జర!
వేంకటేశ్వరా! |
80. |
|
|
|
|
ధనముల నిత్తు రెక్కువ మతాంతర భక్తులు
వత్తు రిద్ధరన్ వనితలు బాలవృద్ధులును వారక వత్తురు
దర్శనార్థమై ఘనతర పుణ్యశైలము సుఖప్రద
పాపవినాశకాద్రికిన్ మనమున నిన్ను నిల్పియు సమంచిత
భక్తిని వేంకటేశ్వరా! |
81. |
|
|
|
|
కీర్తినిఁ గోరి చేయ నది కించి
దవాంఛిత కార్యమే సుమీ కర్తకు దాన వస్తువుల గ్రాహకు లింపుగఁ
గల్గ నేర్తురే యార్తుల కాదరమ్ముగ సహాయత నిచ్చిన దైవకార్యమే ధూర్తుల కబ్బ దట్టి కడుఁ దోరపు
భాగ్యము వేంకటేశ్వరా! |
82. |
|
|
|
|
ఇంచుక దాన మిచ్చిన నహీన దయార్ద్ర
హృదంబుజమ్మునం గొంచెము పూజ చేసిన నకుంఠిత భక్తి
నిరంతరమ్ము నే తెంచిన నంత మాత్రమున దివ్యపు వేంకట నామ
శృంగికిం బంచెద వెల్ల సంపదలు భక్తుల కిమ్ముగ వేంకటేశ్వరా! |
83. |
|
|
|
|
కలిఁ బ్రతిమావతారమునఁ గాయజ సన్నిభ
సుందరాంగ నీ వలరుచు మౌన మూని సక లావని వాసుల కిష్ట దైవమై చెలఁగి విమాన రత్నమతి చిత్రము దివ్య
మగోచరమ్మునై వెలుఁగఁగఁ బ్రోతు వెల్లరను వేఁడిన
యంతనె వేంకటేశ్వరా! |
84. |
|
|
|
|
సురవర యక్ష కిన్నరులు చోద్యము మీఱఁగ వేంకటాద్రిలో సురుచిర పుణ్య తీర్థముల శుద్ధ
జలమ్ములఁ దోఁగి భక్తితో సిరి విభు పాద పద్మ యుగ సేవ వసింప
నదృశ్య రూపులై నిరతము వేఁడుకొందు రట నిశ్చల
చిత్తులు వేంకటేశ్వరా! |
85. |
|
|
|
|
ఉరుతర సంప దోఘమని యుర్విని వెల్గెను వేంకటాద్రిగం బరఁగఁగ నీల నామ కపి పన్నుగ నొప్పెను నీల శృంగిగన్ నరహరి రూపుఁడై వెలుఁగ నామము కల్గెను
సింహ శృంగిగన్ హరి వర మాత సేయ తప మంజన శైలమ
వేంకటేశ్వరా! |
86. |
|
|
|
|
దివ్యము ధారుణిం గపిల తీర్థము ధామము
చంద్ర మౌలికిన్ భవ్యము పాప నాశకము భక్త వరేప్సిత
దాయకమ్మునై యవ్యయ కీర్తితమ్ము సక లాంచిత తీర్థనిమజ్జ నాభమున్ నవ్య జలప్రకాశము ననంత సుకీర్తిత!
వేంకటేశ్వరా! |
87. |
|
|
|
|
సనక సనంద నాది ముని సంఘము వేఁడఁగ
వేంకటాద్రి దు ర్జన కృత సంకటమ్ములను సర్వము ఖర్వము
సేసి యంత భూ జనులకుఁ బూర్వ కాలమున సంతత దర్శన భాగ్యమిచ్చుచుం దనరితి వయ్య నేఁడు మము ధన్యులఁ జేయవె
వేంకటేశ్వరా! |
88. |
|
|
|
|
జగతి వరాహ మంత్రము నచంచల భక్తిఁ
బఠించి నిత్యమున్ సుగతినిఁ బొందె ధర్ముఁడు ప్రచోదితుఁ డయ్యజ
వాచ్య బోధలన్ నగరిపుఁ డార్య శాపము వినాశము సెందఁగ నేలె నాకమే యగ వరుఁ డా యనంతుఁ డిల నంత ధరించెను వేంకటేశ్వరా! |
89. |
|
|
|
|
అనుదిన మెవ్వఁ డేని యిల నంచిత భక్తిని బూజ సేసినన్ ఘనముగ నీదు భక్తులను గారవ మొప్పఁగ
సన్నుతించినన్ వినినను నీదు గాథలను వీనుల కింపుగఁ
దన్మయమ్మునం గనికర మొప్పఁ గాచెదవు కానల నున్నను
వేంకటేశ్వరా! |
90. |
|
|
|
|
బ్రహ్మ మహోత్సవమ్ము ధ్వజ భాసిత మాశ్వయుజమ్మునన్
ఘనా జిహ్మ సుమంత్ర పూజితము శ్రీ యుత కేశవ
సమ్మతమ్ముగన్ బ్రాహ్మణ రాజ వైశ్య వృషలవ్రజ సేవిత
పర్వమున్ స దా జహ్మము ముక్తి దాయకము సర్వ జనాళికి
వేంకటేశ్వరా! |
91. |
|
|
|
|
భిదురములౌ నఘమ్ములకు వేంకట నాథ
సుకీర్తనావళుల్ వెదక విభూతి మూలములు వేంకట నాథ సుకీర్తనావళుల్ విదితపు మోక్ష మార్గములు వేంకట నాథ
సుకీర్తనావళుల్ వదలక చిత్త మందు నిడి ప్రార్థన సేసిన వేంకటేశ్వరా! |
92. |
|
|
|
|
చలుపఁగ నన్న దానమును సప్త కులావధి
నిత్తు వన్నమున్ సలిలపు శాల లేర్పరుపఁ జక్కఁగ శీతల
చిత్తుఁ డౌదువే ఫలిత మహీన సంపద కృపం గనినన్ వికలాంగు లెల్లరం జెలువపు టుత్సవాహములఁ జిత్రము సూడఁగ వేంకటేశ్వరా! |
93. |
|
|
|
|
అనయము కోపతాపముల నన్యుల కెంతయుఁ గీడు
సేయుచుం దనువుల యందు మోహమున దారుణ కర్మము లాచరించుచుం గనులకు గోచరింపఁగనె కాంతల నెల్లరఁ
గోరునట్టి దు ర్జనులకు విందు దండధరు సమ్మెట పోటులు వేంకటేశ్వరా! |
94. |
|
|
|
|
జన్మము లందు దుర్లభము చక్కటి మానవ
జన్మ మిద్ధరన్ సన్మతి ధర్మసంయుతము శార్ఙ్గధ రాంచిత
పాద చింతనా తన్మయ పారవశ్యమునఁ దామర సాక్ష
సుపూజలం బున ర్జన్మ నివృత్తి సేకురు నసత్యము
గాదిల వేంకటేశ్వరా! |
95. |
|
|
|
|
మహిమపు స్వామి పుష్కరిణి మాన్పు రజో౽ఘము
స్వర్ణ చౌర్య దో ష హరము సేయు మజ్జనము సల్పిన మాత్రమ
సత్వరమ్ము నౌ యిహపర సౌఖ్య దాయకము నింపుగ దర్శన పాన సంగమా ద్యహరహ పుణ్య కృత్యముల నక్షధ
రాచ్యుత! వేంకటేశ్వరా! |
96. |
|
|
|
|
శరణము లెల్ల దుఃఖముల శార్ఙ్గధ రాంచిత
పాదపద్మముల్ తరణము లిభ్భవాంబుధుల దాఁట రమావిభు నామకీర్తనల్ తురగము లక్షయస్థలికిఁ దోయజ నాభు సుపూజనావళుల్ కరములు మోడ్చి మ్రొక్కెదను గైటభ
ఖండన! వేంకటేశ్వరా! |
97. |
|
|
|
|
అక్షము లేని తేరున విహారము ధారుణిఁ జేయ శక్యమే పక్షము లున్నఁ గాని భువిఁ బక్షులు
పైకెగురంగ శక్యమే చక్షువు లున్నఁ గాని మఱి జన్యువు లిద్ధరఁ జూడ శక్యమే యక్షయ జ్ఞాన యోగమున నైహిక ముక్తులు వేంకటేశ్వరా! |
98. |
|
|
|
|
అమర సహస్ర భోగ చతురానన షణ్ముఖ కీర్త నాతిరి క్తము సిరి వాస భూషితము తామరసాక్ష మనో వికాస శై లము ధన హేమ ధాన్యద విరాజిత మిద్ధర
వేంక టాద్రియే సముచిత రీతిఁ గొల్చెదము సన్మతి
నిత్యము వేంకటేశ్వరా! |
99. |
|
|
|
|
శిష్ట జనాళి రక్షక విశేష కృపారస
సిక్త వీక్షణా దుష్ట జనాళి శిక్షక సదుద్భవ పాలన నాశ
హేతుకా కష్టత రానివార్య భవ ఖండన కార్య
నిమగ్న దైవమా తుష్ట సుభక్త సేవిత సదుజ్జ్వల విగ్రహ వేంకటేశ్వరా! |
100.
|
|
|
|
|
శ్రీకర! భక్త సంచయ వశీకర! పాప వినాశ
కారకా! నాక నివాస నిర్జర గణప్రభు పూజిత
పాదపద్మ! ప ద్మాకర భాసిత క్షితిధరాలయ! మాధవ! భూ రమా
కరా నేక సుమార్చితాంఘ్రి యుగ! నిన్ను
నుతించెద వేంకటేశ్వరా! |
101.
|
ఇది
విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీ పేర్రాజ దంపతీ సుత
వేంకట
రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత
శ్రీ
వరాహ పురాణ ప్రామాణిక
వేంకటేశ్వర
శతకము.
-*-
|
|
వేంకటేశ్వరా శతకము |
|
గ్రంథ
కర్తృ దంపతులు |
వివరములు:
పోచిరాజు కామేశ్వర
రావు,
M.Tech. (Machine Design)
స్వగ్రామము:
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు
గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఉద్యోగము:
1.
Retd. Senior Manager, Electronics Corporation
of India Limited (A Govt. of India Undertaking), Hyderabad.
2.
Former Assoc. Professor, Dept. Of Mech. Engg.
, M.V.S.R Engineering College Hyderabad.
3.
Former Assoc. Professor, Dept. Of Mech. Engg.
, Rungta College of Engineering and
Technology, Raipur.
నివాసము: H.No. 19, Shiva
Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013
Cell. Nos.
8602787525, 9440378434.
స్వీయ రచనలు:
1.
రామ చంద్ర శతకము.
2.
పోచిరాజ శతకము.
3.
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).
4. వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ
సంభృతము).
5.
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).
6.
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).
7.
శ్రీమన్నారాయణ శతకము.
8.
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).
9.
శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.
10.
మాహేశ్వర దండకము.
11.
మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.
12.
ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుఁడు
13.
శ్రీమదాంధ్ర రామాయణము.
14.
శ్రీ బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది)
15.
గోవిందము.
No comments:
Post a Comment